వాక్కాయ పప్పు

ABN , First Publish Date - 2015-08-29T23:40:12+05:30 IST

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావు కిలో, కందిపప్పు - 1 కప్పు, పసుపు - పావు టీ స్పూను, పచ్చిమిర్చి - 4,

వాక్కాయ పప్పు

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావు కిలో, కందిపప్పు - 1 కప్పు, పసుపు - పావు టీ స్పూను, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి రెబ్బలు - 5, ఉల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఆవాలు + జీలకర్ర + మినప్పప్పు - 1 టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి - 3, మెంతులు - చిటికెడు, ధనియాలు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: వాక్కాయల్ని కడిగి, కోసి లోపలి గింజల్ని తీసేయాలి. కుక్కర్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, వాక్కాయ తరుగుతో పాటు రెండు కప్పుల నీరు పోసి ఒక విజిల్‌ రాగానే స్టౌవ్‌ ఆపేయాలి. చల్లారాక ఉప్పు వేసి పప్పుని గరిటతోనే కాస్త మెదుపుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేగాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ధనియాలు, కరివేపాకు, ఉల్లి తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేగించి, పప్పు మిశ్రమంలో కలపాలి. ఇష్టముంటే కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు. ఈ పప్పు పుల్లపుల్లగా ఉండి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:40:12+05:30 IST