సోయికూర పప్పు

ABN , First Publish Date - 2015-08-29T23:37:06+05:30 IST

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, సోయికూర - 1 కట్ట, ఉల్లిపాయ - 1, టమోటా - 1, కారం, జీలకర్ర - 1 స్పూను చొప్పున,

సోయికూర పప్పు

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, సోయికూర - 1 కట్ట, ఉల్లిపాయ - 1, టమోటా - 1, కారం, జీలకర్ర - 1 స్పూను చొప్పున, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, నీళ్లు - 2 కప్పులు, నూనె - తగినంత, ఉప్పు - సరిపడా.
తయారుచేసే విధానం: పప్పుని అరగంట నానబెట్టాలి. కుక్కర్లో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలను నూనెలో వేగించి తరగిన సోయికూర కలపాలి. ఆకు పచ్చివాసన పోయిన తర్వాత టమోటా తరుగు, నానబెట్టిన పప్పు, కారం, ఉప్పు, రెండు కప్పుల నీరు పోసి 2 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి. ఈ పప్పు చపాతీలకు మంచి కాంబినేషన్‌.

Updated Date - 2015-08-29T23:37:06+05:30 IST