కంద అరటి ముద్దకూర

ABN , First Publish Date - 2015-09-03T17:48:32+05:30 IST

కావలసిన పదార్థాలు: కంద, అరటికాయ ముక్కలు - 1 కప్పు చొప్పున, కారం - 1 టీ స్పూను, పసుపు

కంద అరటి ముద్దకూర

కావలసిన పదార్థాలు: కంద, అరటికాయ ముక్కలు - 1 కప్పు చొప్పున, కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చికొబ్బరి (తురుము) - అర చిప్ప, ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి - 2.
తయారుచేసే విధానం: కంద, అరటి ముక్కల్లో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. పచ్చికొబ్బరి, కారం, జీలకర్ర కలిపి పేస్టులా చేసుకుని 3 టీ స్పూన్లు తీసి పక్కనుంచాలి. ఉడికించిన ముక్కల్లో మిగతా పేస్టు కలిపి చిన్నమంటపై మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, (పక్కనుంచిన) కొబ్బరి పేస్టు దోరగా వేగించి ఆ ముక్కల్లో కలపాలి.

Updated Date - 2015-09-03T17:48:32+05:30 IST