గుమ్మడి మునక్కాడల కూర

ABN , First Publish Date - 2015-09-03T17:18:46+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు - ఒక కప్పు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు

గుమ్మడి మునక్కాడల కూర

కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు - ఒక కప్పు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు, టమాటా ముక్కలు - ఒక కప్పు, పల్లీల పేస్టు - అర కప్పు, పచ్చి కొబ్బరి పేస్టు - అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీ స్పూను, పసుపు చిటికెడు, ధనియాల పొడి - ఒక టీస్పూను, కొత్తిమీర - ఒక టీస్పూను, గరం మసాలా - ఒక టీస్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగించాక అల్లంవెల్లుల్లి ముద్ద, పల్లీల పేస్టు, పచ్చి కొబ్బరి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేగించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి అవీ వేగాక ఉడికించి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు, మునక్కాడ ముక్కలు, ఉప్పు, కారం వేసి కలిపి కూర దగ్గర పడ్డాక ధనియాలపొడి, గరం మసాలా పొడి వేసి దించేయాలి.

Updated Date - 2015-09-03T17:18:46+05:30 IST