మైదా మురుకులు

ABN , First Publish Date - 2015-09-04T20:26:53+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా - 1 కప్పు, వేగించి పొడిచేసిన మినప్పిండి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

మైదా మురుకులు

కావలసిన పదార్థాలు: మైదా - 1 కప్పు, వేగించి పొడిచేసిన మినప్పిండి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, వెన్న - 1 టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ఒక పలచటి గుడ్డంలో మైదాపిండిని మూటగట్టి ఒక వెడల్పాటి గిన్నెలో ఉంచి కుక్కర్‌లో (విజిల్‌ పెట్టకుండా) అరగంటసేపు ఉడికించాలి. పిండి చల్లారనిచ్చి అందులో మినప్పిండి, ఉప్పు, ఇంగువ, జీలకర్ర, వెన్న వేసి ముద్దగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో నక్షత్రం గుర్తున్న ప్లేట్‌ అమర్చుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇవి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-04T20:26:53+05:30 IST