చపాతీ కాప్సికమ్‌ రోల్స్‌

ABN , First Publish Date - 2015-10-17T16:00:19+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: రెండుకప్పులు, కాప్సికమ్‌: రెండు(సన్నగా నిలువుగా కట్‌ చేసి పెట్టుకోవాలి)

చపాతీ కాప్సికమ్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: రెండుకప్పులు, కాప్సికమ్‌: రెండు(సన్నగా నిలువుగా కట్‌ చేసి పెట్టుకోవాలి), టమోటాలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), ఉల్లిపాయ(పెద్దది): ఒకటి(ముక్కలుగా చేసుకోవాలి), పచ్చిమిర్చి: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), మిరియాల పొడి: టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, పసుపు: అర టీ స్పూను, టమోటా కెచప్‌: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నీరు: తగినంత, నూనె: తగినంత.
తయారీ విధానం: ముందుగా గోధుమపిండిలో ఉప్పు వేసి మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి కాగిన తరువాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. అనంతరం కాప్సికమ్‌, టమోట ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దించే ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమోటా కెచప్‌ వేసుకొని కొద్దిసేపు పొయ్యి మీద వుంచి దించేయాలి. ఇప్పుడుతడిపి పెట్టుకున్న పిండితో చపాతీలు వొత్తుకోవాలి. చపాతిని కాల్చిన తరువాత ఒక వైపు సిద్ధం చేసి పెట్టుకున్న కాప్సికమ్‌ కర్రీని పెట్టి రోల్స్‌గా చుట్టుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా మధ్యాహ్నం లంచ్‌బాక్స్‌లోకి రుచిగా వుంటుంది.

Updated Date - 2015-10-17T16:00:19+05:30 IST