దహీ పనీర్‌

ABN , First Publish Date - 2015-10-23T16:17:25+05:30 IST

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు: రెండు వందల గ్రాములు, ఆవాలు, సోంపు గింజలు, జీలకర్ర: అరస్పూను

దహీ పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు: రెండు వందల గ్రాములు, ఆవాలు, సోంపు గింజలు, జీలకర్ర: అరస్పూను చొప్పున, ఇంగువ: చిటికెడు, పచ్చిమిరపకాయలు: రెండు (ముక్కలు చేసుకోవాలి), కారం: అర టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడ, పసుపు: కొద్దిగా, పెరుగు: రెండు కప్పులు, కొత్తిమీర: కొద్దిగా, నూనె: సరిపడ
తయారీ విధానం: మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకుని నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పనీర్‌ ముక్కలు వేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సన్నని మంట మీద వేగనివ్వాలి. అనంతరం పచ్చిమిరప కాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి మరికొద్దిసేపు వేగనిచ్చి ఇప్పుడు పెరుగు జతచేయాలి. పెరుగు జత చేసిన తరువాత కనీసం ఐదు నిమిషాల పాటు పొయ్యిపై ఉడకనిచ్చి దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2015-10-23T16:17:25+05:30 IST