సగ్గుబియ్యం స్నాక్‌

ABN , First Publish Date - 2016-02-10T14:28:54+05:30 IST

కావలసిన పదార్థాలు: చిలకడ దుంప - ఒకటి, సగ్గుబియ్యం - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు - ఒక రెబ్బ, పచ్చిమిరపకాయలు -

సగ్గుబియ్యం స్నాక్‌

కావలసిన పదార్థాలు: చిలకడ దుంప - ఒకటి, సగ్గుబియ్యం - అర కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, కరివేపాకు - ఒక రెబ్బ, పచ్చిమిరపకాయలు - రెండు, కొత్తిమీర తురుము - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: సగ్గుబియ్యాన్ని ఓ అరగంట నీళ్లలో నానబెట్టాలి. చిలకడ దుంపలపై పొట్టు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, శెనగపప్పు వేసి వేగించాలి. తర్వాత చిలకడ దుంప ముక్కలు వేసి ఎర్రగా అయ్యేవరకూ వేగించాలి. చివర్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగించాలి. దించేముందు తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి. వీటిని సాయంత్రం స్నాక్స్‌లా తింటే బాగుంటాయి.

Updated Date - 2016-02-10T14:28:54+05:30 IST