బ్రెడ్‌ బజ్జీ

ABN , First Publish Date - 2016-02-10T14:51:06+05:30 IST

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లయిస్‌లు - నాలుగు, శెనగపిండి - ఒక కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూన్‌, కారం - అర టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా,

బ్రెడ్‌ బజ్జీ

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లయిస్‌లు - నాలుగు, శెనగపిండి - ఒక కప్పు, జీలకర్ర - ఒక టీ స్పూన్‌, కారం - అర టీస్పూన్‌, నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, వంటసోడా - చిటికెడు.
తయారీ విధానం: ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ వేడి వేడి బ్రెడ్‌ బజ్జీలను సాస్‌ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2016-02-10T14:51:06+05:30 IST