బేబీ కార్న్‌ పకోడి

ABN , First Publish Date - 2016-02-10T14:37:07+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా - ఐదు టేబుల్‌ స్పూన్లు, బేబీకార్న్‌ - పది, కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌ స్పూన్‌, మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు-

బేబీ కార్న్‌ పకోడి

కావలసిన పదార్థాలు: మైదా - ఐదు టేబుల్‌ స్పూన్లు, బేబీకార్న్‌ - పది, కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌ స్పూన్‌, మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, అల్లం - చిన్న ముక్క, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: బేబీకార్న్‌ నిలువుగా రెండు భాగాలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంలను మిక్సీ వేసుకోవాలి. అందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉప్పు, మసాలా పేస్ట్‌, కొత్తిమీర తరుగు వేసి నీళ్లతో పకోడి పిండిలా కలపాలి. ఈ పిండిలో బేబీకార్న్‌ ముక్కల్ని ముంచి నూనెలో వే సి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వేడివేడిగా తింటుంటే కరకరమంటూ బాగుంటాయి.

Updated Date - 2016-02-10T14:37:07+05:30 IST