బీట్‌రూట్‌ రైస్‌

ABN , First Publish Date - 2017-02-11T17:50:50+05:30 IST

బీట్‌రూట్‌ - ఒకటిన్నర కప్పు (సన్నగా తరిగి), అన్నం- రెండు కప్పులు, పచ్చిమిర్చి...

బీట్‌రూట్‌ రైస్‌

కావలసినవి
 
బీట్‌రూట్‌ - ఒకటిన్నర కప్పు (సన్నగా తరిగి), అన్నం- రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, ధనియాల పొడి, జీలకర్ర - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, పచ్చి బఠాణీలు - ఒక కప్పు, కొత్తిమీర - ఒక కట్ట, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ విధానం
 
తరిగిన బీట్‌రూట్‌ను ఉడికించాలి. తరువాత ఉడికించిన నీళ్లని ఒకపాత్రలోకి వంపి పక్కన పెట్టాలి. పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడిచేశాక జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చిని సన్నగా తరిగి దాన్ని కూడా వేసి వేగించాలి. ఆ తరువాత ఉడికించి, వడకట్టిన బీట్‌రూట్‌ని వేసి గరిటెతో కలపాలి. ధనియాల పొడి, పచ్చి బఠాణీలు వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. తరువాత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో అన్నం, బీట్‌రూట్‌ నీళ్లు పోసి కలపాలి. కాసేపయ్యాక స్టవ్‌ ఆపేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసి వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-02-11T17:50:50+05:30 IST