మ్యాంగో రైస్‌

ABN , First Publish Date - 2017-04-30T19:45:39+05:30 IST

బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను

మ్యాంగో రైస్‌

కావలసిన పదార్థాలు
 
బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు- ఒక్కో టీ స్పూను, అల్లం తురుము- అర టీ స్పూను, ఎండు మిర్చి- రెండు, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- ఒక రెబ్బ, పసుపు- అర టీ స్పూను, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి. తర్వాత అల్లం తురుము, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి 2 నిమిషాలు వేగించాలి. మామిడి తురుము, ఉప్పు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి చిన్నమంట మీద 4 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2017-04-30T19:45:39+05:30 IST