మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కిచిడీ

ABN , First Publish Date - 2017-11-11T18:01:15+05:30 IST

బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పెసరపప్పు - మూడు కప్పులు, బంగాళాదుంపలు - రెండు, పచ్చి బఠాణీలు...

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కిచిడీ

కావాల్సినవి
 
బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పెసరపప్పు - మూడు కప్పులు, బంగాళాదుంపలు - రెండు, పచ్చి బఠాణీలు - పావు కప్పు, క్యారెట్‌ - ఒకటి, పచ్చి మిర్చి - మూడు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు - ఒక్కోటి రెండు చొప్పున, అల్లం, పసుపు - కొద్దిగా, లవంగాలు - నాలుగు, ధనియాల పొడి - రెండు టీ స్పూన్‌లు, ఇంగువ - చిటికెడు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, ఆవాలు, జీలకర్ర - ఒక్కో టీ స్పూన్‌ చొప్పున, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారివిధానం
 
కుక్కర్‌లో నెయ్యి వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, బిర్యానీ ఆకు వేగించాలి. తరువాత కూరగాయలు, మిగిలిన పదార్థాలన్నీ వేసి, ఒక కప్పు నీళ్లు పోసి కలిపి బియ్యం, పప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. ఆవిరి పోయాక దింపి వేడి వేడిగా తినాలి.

Updated Date - 2017-11-11T18:01:15+05:30 IST