పెరుగన్నం

ABN , First Publish Date - 2018-04-28T21:43:11+05:30 IST

పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యం-రెండు కప్పులు, పాలు- మూడు కప్పులు, ఉల్లిపాయలు..

పెరుగన్నం

కావలసినవి
 
పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యం-రెండు కప్పులు, పాలు- మూడు కప్పులు, ఉల్లిపాయలు-మూడు, పచ్చిమిర్చి-రెండు, ఉప్పు-రుచికి సరిపడా.
 
తయారీవిధానం
 
లోతైన నాన్‌స్టిక్‌ పాన్‌లో పాలు పోసి గోరువెచ్చగా వేడిచేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి ఒక పాత్రలో వేసి అందులో అన్నం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత రెండు పాత్రల్లో ఈ అన్నాన్ని సమపాళ్లలో సెట్‌ చేయాలి. గోరువెచ్చటి పాలల్లో పెరుగు కలిపి దాన్ని రెండు పాత్రల్లోని అన్నంపై నిండుగా పోయాలి. ఈ పాత్రల్లో పెరుగు తోడుకున్నాక వాటిని రిఫ్రిజిరేటర్‌లో కాసేపు ఉంచి తింటే చల్లగా, రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-04-28T21:43:11+05:30 IST