మునక్కాడ కూటు

ABN , First Publish Date - 2018-08-21T21:29:14+05:30 IST

మునక్కాయలు: ఏడు లేక ఎనిమిది(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), కందిపప్పు: పావు కప్పు..

మునక్కాడ కూటు

కావలసిన పదార్థాలు
 
మునక్కాయలు: ఏడు లేక ఎనిమిది(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), కందిపప్పు: పావు కప్పు(ఉడికించుకుని మెత్తగా చేసి పెట్టుకోవాలి), ఎండుమిరపకాయలు: ఐదు లేక ఆరు, మిరియాలు: రెండు టేబుల్‌ స్పూన్లు, మినపప్పు: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిశనగపప్పు: టేబుల్‌ స్పూను, కొబ్బరిపొడి: మూడు లేక నాలుగు స్పూన్లు, సాంబారు పొడి: రెండు స్పూన్లు, ఇంగువ: చిటికెడు, పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినత, కరివేపాకు: కొన్ని ఆకులు, బియ్యంపిండి: టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
 
మునక్కాయలను సమానంగా కట్‌ చేసుకుని వేడినీటిలో కొద్దిగా ఉప్పు, సాంబారు పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత నీటిని వంపకుండా పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దినూనె వేసి కాగిన తరువాత ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. చివరగా దీనికి కొబ్బరి పొడి జత చేసి చల్లారిన తరువాత ముద్దగానూరుకోవాలి. ఇప్పుడు బాండీలో తగినత నూనె పోసి కాగిన తరువాత రుబ్బిపెట్టుకున్న ముద్ద, మునక్కాయలు, రెడీగా పెట్టుకున్న కందిపప్పు, ఉప్పు వేసి ఉడికించిన నీటిని పోసి బాగా ఉడికించుకోవాలి. దింపేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2018-08-21T21:29:14+05:30 IST