Abn logo

ఆపిల్‌ పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - అరకప్పు, మైదా - అరకప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు, (తొక్కతీసి, తురిమిన) ఆపిల్‌ - 1, పాలు - 3 కప్పులు, దాల్చినచెక్క పొడి - 1 టీ స్పూను, పంచదార - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - చిటికెడు, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మైదా, బేకింగ్‌ పౌడర్‌, పంచదార కలపాలి. అందులోనే తురిమిన ఆపిల్‌గుజ్జు, దాల్చినచెక్క పొడి, పాలు, నూనె కూడా వేసి ఉండలు లేకుండా జారుగా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత నాన్‌ స్టిక్‌ పెనంపైన అరకప్పు చొప్పున పోస్తూ (స్ర్పెడ్‌ చేయకూడదు), సన్నని మంటపై రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి. వీటిని తేనెలో అద్దుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలిరైతు వ్యతిరేక చట్టాల రద్దు కాలయాపనపై నిరసనశ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం మరువలేదుక్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్యటీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండికల్యాణం.. కమనీయంఅభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలివిద్యాశాఖ వినూత్న విధానంఅసంక్రమణ వ్యాధుల నివారణ శిబిరం పరిశీలన
Advertisement
Advertisement