కాప్సికమ్‌ ఆమ్లెట్‌

ABN , First Publish Date - 2015-08-29T23:17:51+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాప్సికం -1, గుడ్డు (తెల్ల) సొన - 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాలపొడి - అర టీ స్పూను

కాప్సికమ్‌ ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: క్యాప్సికం -1, గుడ్డు (తెల్ల) సొన - 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాలపొడి - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం తరుగు - 1 టీ స్పూను. నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: క్యాప్సికంను సన్నని ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో గుడ్డు తెల్ల సొన, మిరియాలపొడి, అల్లం, క్యాప్సికం తరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా గిలకొట్టి పెనంపైన ఆమ్లెట్‌ వేసి మాడకుండా సన్నని మంటపై దోరగా వేగించుకోవాలి. అన్నంతో నంజుకోవడానికి ఈ ఆమ్లెట్‌ వెరైటీ రుచితో చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:17:51+05:30 IST