Abn logo

బెంగుళూరు వంకాయ పెరుగు చట్నీ

కావ

లసిన పదార్థాలు: బెంగుళూరు వంకాయలు - 2, పసుపు - చిటికెడు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - పావు టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు+జీలకర్ర+మినప్పప్పు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి+ అల్లం పేస్టు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో పెరుగు, తగినంత ఉప్పు, ఆవపిండి వేసి గిలకొట్టి పెట్టుకోవాలి. కడాయిలో సన్నగా కోరిన / తరిగిన బెంగుళూరు వంకాయల్లో, కప్పు నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించి మెదపాలి. ఈ గుజ్జుని పెరుగులో వేసి కలపాలి. మరో పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు,మినప్పప్పు, కరివేపాకు, ఇంగువతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు, చపాతీల్లో కూడా బాగుంటుంది.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement