పనీర్‌ పుదీనా శాండ్‌విచ్‌

ABN , First Publish Date - 2015-08-31T16:17:39+05:30 IST

కావలసినవి: బ్రెడ్‌ ముక్కలు 8, వెన్న తగినంత, పనీర్‌ 150 గ్రాములు, పుదీనా సగం కట్ట, ఉల్లిపాయ చిన్నది

పనీర్‌ పుదీనా శాండ్‌విచ్‌

కావలసినవి: బ్రెడ్‌ ముక్కలు 8, వెన్న తగినంత, పనీర్‌ 150 గ్రాములు, పుదీనా సగం కట్ట, ఉల్లిపాయ చిన్నది ఒకటి, పచ్చిమిర్చి 3, ఉప్పు- తగినంత, చాట్‌ మసాలా ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం
ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, పుదీనాని సన్నగా తరిగి పెట్టుకోండి. పనీర్‌ చేత్తో మెత్తగా పిసికేసి ఈ ముక్కల్ని, చాట్‌ మసాలాను, ఉపను దానిలో కలిపేయండి. బ్రెడ్‌ ముక్కల మీద ముందుగా వెన్న రాసి దాని పైన ఈ మిశ్రమాన్ని సమంగా పూసి టమోటా కెచప్‌తో కలిపి తినండి. చేసుకోవడం తేలిక. పైగా కొత్త రుచి.

Updated Date - 2015-08-31T16:17:39+05:30 IST