పైనాపిల్‌ పాన్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-08-31T16:19:19+05:30 IST

కావలసిన పదార్థాలు: పండిన ఫైనాపిల్‌ - అర కిలో, మైదా - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను

పైనాపిల్‌ పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: పండిన ఫైనాపిల్‌ - అర కిలో, మైదా - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను, కొబ్బరి తురుము - 35 గ్రా., పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, పాలు - పావు లీటర్‌, బటర్‌ - 40 గ్రా., వెనీలా ఎసెన్స్‌ - 1 టీ స్పూను, గుడ్లు - 2.
తయారుచేసే విధానం: ఫైనాపిల్‌ని గుండ్రటి (8) ముక్కలుగా తరిగి విడివిడిగా పేపర్‌ టవల్‌పై ఉంచాలి. ఒక పాత్రలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, కొబ్బరితురుము, పంచదార వేసి బాగా కలపాలి. మరో కప్పులో వెనీలా ఎసెన్స్‌, గుడ్లు, పాలు వేసి ఫోర్క్‌తో గిలకొట్టి కొబ్బరితురుము మిశ్రమంలో కలపాలి. తర్వాత నాన్‌స్టిక్‌ పెనంపై బటర్‌ రాసి గరిటెతో మిశ్రమాన్ని దళసరి దోశల్లా వేసి మఽధ్యలో ఫైనాపిల్‌ ముక్కని పెట్టి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. తినేముందు కేక్‌పై కొద్దిగా తేనె వేసుకుంటే మరింత బాగుంటుంది.

Updated Date - 2015-08-31T16:19:19+05:30 IST