కుంభ్‌ కా సబ్జీ

ABN , First Publish Date - 2015-08-31T21:33:30+05:30 IST

కావలసినవి: పుట్టగొడుగులు 800 గ్రా., ఉల్లిపాయలు 60 గ్రా., అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్‌

కుంభ్‌ కా సబ్జీ

కావలసినవి: పుట్టగొడుగులు 800 గ్రా., ఉల్లిపాయలు (సన్నగా కోసుకోవాలి) 60 గ్రా., అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్‌, వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను, టమోటా ముక్కలు 100 గ్రా., పచ్చబఠాణీలు 100 గ్రా., దిల్‌ 1 కట్ట, షాజీరా ఒక స్పూన్‌, ఉల్లికాడ 1 కట్ట, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్‌, ఎండుమిర్చి 2, నూనె 40 గ్రా., నిమ్మరసం 2 కాయలవి, కొత్తిమీర కొంచెం.
ఎలా చేయాలి: నూనె వేడిచేసి షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠాణీలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి. ఆపై పుట్టగొడుగులు వేసి సన్నమంటపై ఉడికించాలి. దిల్‌ ఆకులు, కోసిన ఉల్లి కాడ వేశాక నిమ్మరసం పిండి దించేయండి. వేడిమీద తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-31T21:33:30+05:30 IST