రైస్‌ పుడ్డింగ్‌

ABN , First Publish Date - 2016-02-23T15:37:15+05:30 IST

కావలసిన పదార్థాలు: గుడ్లు - మూడు (గిలక్కొట్టి), బియ్యం - ఒక కప్పు, కొవ్వు తీయని పాలు - ఏడు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, ఉప్పు-

రైస్‌ పుడ్డింగ్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు - మూడు (గిలక్కొట్టి), బియ్యం - ఒక కప్పు, కొవ్వు తీయని పాలు - ఏడు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, ఉప్పు- చిటికెడు, వెనిల్లా - ఒక టీస్పూన్‌, దాల్చిన చెక్క - అలంకరణకు.
తయారీ విధానం: ఒక గిన్నెలో బియ్యం, పంచదార, ఉప్పు వేయాలి. నీళ్లు, నాలుగు కప్పుల పాలు పోయాలి. సన్నటి మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ 30 నిమిషాలు బియ్యం ఉడికించాలి. మిగిలిన మూడు కప్పుల పాలలో గుడ్డు సొన, వెనిల్లా పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో పోసి స్టవ్‌ పెంచి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పుడ్డింగ్‌ మిశ్రమం చల్లబడిన తరువాత దీన్ని పెద్ద గిన్నెలో వేసి పైన దాల్చిన చెక్క పొడి చల్లాలి. లేదా చిన్న కప్పుల్లో పుడ్డింగ్‌ తీసి ఒక్కో కప్‌ మీద చల్లుకోవచ్చు. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Updated Date - 2016-02-23T15:37:15+05:30 IST