ఎగ్‌రోల్స్‌

ABN , First Publish Date - 2016-07-30T17:27:40+05:30 IST

కావలసినవి : మైదా - ఒక కప్పు, నీళ్లు, ఉప్పు - తగినంత, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి(సన్నగా తరిగి), కీరదోసకాయ - ఒకటి (సన్నగా, నిలువుగా), పచ్చి మిర్చి - రెండు(సన్నగా తరిగి), నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, టొమాటొ సాస్‌ - కొద్దిగా.

తయారీ :
నీళ్లుపోసి మైదాపిండిని ముద్దలా కలిపి పరాఠాలు చేయాలి. ఒక గిన్నెలో కోడిగుడ్డును పగుల కొట్టి చిటికెడు ఉప్పు కలపాలి. పాన్‌లో ఒకటేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసి అందులో కోడిగుడ్డు మిశ్రమం వేసి పరాఠా ఎంత సైజులో ఉంటే ఆ సైజులో వచ్చే విధంగా ఆమ్లెట్‌ వేయాలి. ఆమ్లెట్‌ సగం ఉడికాక పరాఠాను దానిమీద పెట్టి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత పరాఠాను తిప్పి కాసేపు ఉంచి బయటకు తీయాలి. ఆమ్లెట్‌ ఉన్నవైపు పైకి ఉంచి అందులో కీర దోసకాయ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిపైన టొమాటో సాస్‌ వేసి రోల్‌ చేయాలి. పైన నిమ్మరసం చల్లుకుని తింటే యమ్మీ యమ్మీగా ఉంటాయి.

Updated Date - 2016-07-30T17:27:40+05:30 IST