Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎగ్‌లెస్ టూటీ ప్రూటీ కుకీస్

కావలసిన పదార్థాలు

మైదా- ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- అర కప్పు, వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను, ధనియాల పొడి- పావు టీ స్పూను, తినే సోడా- అర టీ స్పూను, ట్యూటీ ఫ్రూటీ- పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పులు- మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు- రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం

మైదాలో కస్టర్డ్‌ పౌడర్‌, తినే సోడా, ధనియాల పొడి, ట్యూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. విడిగా చక్కెర పొడిలో నెయ్యి, పాలు, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. దాన్ని పై మిశ్రమానికి జతచేసి బాగా కలిపి 30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత కుక్కీస్‌ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇడ్లీకుక్కర్‌లో (నీళ్లు పోయకుండా) లేదా ఓవెన్‌లో 170 డిగ్రీ సెల్సియస్‌ వద్ద 10 నిమిషాలు ఉడికించాలి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement