మటన్‌ రోస్ట్‌

ABN , First Publish Date - 2017-02-04T15:45:28+05:30 IST

మటన్‌ - అర కిలో పసుపు - 1 టీస్పూను ఉప్పు - తగినంత

మటన్‌ రోస్ట్‌

కావలసిన పదార్థాలు
మటన్‌ - అర కిలో
పసుపు - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
కొబ్బరి నూనె - 2 టే.స్పూన్లు
కరివేపాకు - గుప్పెడు
కందిపప్పు పొడి - 2 టే.స్పూన్లు
గ్రైండింగ్‌ కోసం: సోంపు - 1 టే.స్పూను
ఎండుమిర్చి - 5
కారం - 2 టే.స్పూన్లు
అల్లం - 3 సెం.మీ ముక్క
వెల్లుల్లి - 6
 
తయారీ విధానం
మటన్‌ ముక్కలకు పసుపును, ఉప్పు కలిపి 15 ని. నానబెట్టుకోవాలి.
గ్రైండింగ్‌లో సూచించిన వాటన్నింటినీ కొద్దిగా నీరు చేర్చి మెత్తగా ముద్ద చేసుకోవాలి.
ఈ ముద్దను మటన్‌కు కలిపి ప్రెషర్‌ కుక్కర్‌లోకి మార్చి 3 విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి.
తర్వాత మంట తగ్గించి మరో 20 ని.లపాటు ఉంచి మంట తీసేయాలి.
కుక్కర్‌ మూత తీసి ఉంచి కూర పొడిగా తయారయ్యేలా చూసుకోవాలి.
పూర్తిగా డ్రై అయ్యాక బాండీలో కొబ్బరి నూనె పోసి కరివేపాకు, డ్రై మటన్‌ వేసి 5 ని.లపాటు కలపాలి.
చివర్లో కందిపప్పు పొడి వేసి 10 ని.లపాటు టాస్‌ చేయాలి.
మటన్‌ పొడిగా, ఎర్రగా మారాక మంట తీసేయాలి.

Updated Date - 2017-02-04T15:45:28+05:30 IST