Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎగ్‌నాగ్‌ పౌండ్‌ కేక్‌

కావలసినవి
ఎల్లో కేక్‌ మిక్స్‌ ప్యాకేజ్‌- 1, వెన్న, ఎగ్‌నాగ్‌ (ఎగ్‌ మిల్క్‌ పంచ్‌)- ఒక్కొక్కటి ముప్పావు కప్పు, ఇన్‌స్టెంట్‌ పుడింగ్‌ వెనీలా మిక్స్‌- కొద్దిగా, గుడ్లు- నాలుగు, జాజికాయ పొడి- అర టీస్పూను, కన్ఫెక్షనర్స్‌ షుగర్‌- ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ విధానం
 
ఒవెన్‌ని ముందుగానే 350 డిగ్రీల ఫారెన్‌ హీట్‌లో వేడిచేయాలి. గ్రీజ్డ్‌ ప్యాన్‌ రెడీగా ఉంచుకోవాలి. కేక్‌ మిక్స్‌, మజ్జిగ, ఎగ్‌నాగ్‌ ( ఎగ్‌ పంచ్‌ లేదా ఎగ్‌ మిల్క్‌ పంచ్‌), పుడింగ్‌ మిక్సులను ఎలక్ట్రిక్‌ మిక్సర్‌లో వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. దాంట్లో గుడ్లు, జాజికాయ పొడిని కూడా కలిపి పిండి మెత్తగా వచ్చేవరకూ గ్రైండ్‌ చేయాలి. రెడీగా పెట్టుకున్న కేక్‌ పాన్‌లో ఈ పిండిని పోయాలి. ఒవెన్‌లో ఈ పాన్‌ను ఉంచి 45 నిమిషాలు బేక్‌ చేయాలి. పాన్‌లో కేక్‌ను పది నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని వైర్‌ ర్యాక్‌లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. దానిపై కన్ఫెక్షనర్స్‌ షుగర్‌ను చల్లాలి.

జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలుసంక్షేమ పథకాలకు బ్రేక్‌!ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’ఘనంగా సంక్రాంతి వేడుకలుక్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందిఉపాధ్యాయులకు బదిలీలు సహజంకోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులుఅసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సన్మానం పండుగ పూట విషాదంఏఐటీయూసీ సమావేశాలను విజయవంతం చేయండి
Advertisement