ఓట్స్‌, ఆపిల్‌, సినామిన్‌ కేక్‌

ABN , First Publish Date - 2017-12-23T21:47:46+05:30 IST

ఓట్స్‌- ఒక కప్పు, మీగడ తీసిన పాలు- ఒక కప్పు, తీయదనంలేని యాపిల్‌సాస్‌- అరకప్పు, ఆరెంజ్‌ జ్యూసు...

ఓట్స్‌, ఆపిల్‌, సినామిన్‌ కేక్‌

కావలసినవి
 
ఓట్స్‌- ఒక కప్పు, మీగడ తీసిన పాలు- ఒక కప్పు, తీయదనంలేని యాపిల్‌సాస్‌- అరకప్పు, ఆరెంజ్‌ జ్యూసు- రెండు టేబుల్‌స్పూన్లు, బ్రౌన్‌షుగర్‌- అరకప్పు, యాపిల్‌ - ఒకటి (గుజ్జులా), కుట్టు (బక్‌వీట్‌)- ఒక కప్పు, వంటసోడా, దాల్చినచెక్క పొడి- ఒక్కొక్కటి అర టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
ఒవెన్‌ 200 డిగ్రీల సెంటిగ్రేడులో ముందుగా వేడిచేయాలి. పాలల్లో 15 నిమిషాల సేపు ఓట్స్‌ను నానబెట్టాలి. బ్రౌన్‌షుగర్‌, కుట్టు, బేకింగ్‌ పౌడర్‌, వంటసోడా, దాల్చినచెక్క పొడి వంటి వన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. యాపిల్‌ గుజ్జు నుంచి తీసిన జ్యూసుతో పాటు యాపిల్‌సాస్‌, ఆరెంజ్‌ జ్యూసులను నానిన ఓట్స్‌లను అందులో కలపాలి.
ఇలా తయారైన మిశ్రమం మరీ గట్టిగా ఉందనిపిస్తే మరో టేబుల్‌స్పూను ఆరెంజ్‌ జ్యూసు అందులో కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని గ్రీస్డ్‌ పాన్‌లో పోసి ముందుగానే వేడిచేసిన ఒవెన్‌లో 25 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. కేక్‌ రెడీ.

Updated Date - 2017-12-23T21:47:46+05:30 IST