రొయ్యల వేపుడు

ABN , First Publish Date - 2018-01-20T21:46:59+05:30 IST

పచ్చి రొయ్యలు-200 గ్రాములు, నిమ్మరసం-రెండు టీస్పూన్లు, నూనె- ఒకటిన్నర టీస్పూను, ఉప్పు-తగినంత..

రొయ్యల వేపుడు

కావలసినవి
 
పచ్చి రొయ్యలు-200 గ్రాములు, నిమ్మరసం-రెండు టీస్పూన్లు, నూనె- ఒకటిన్నర టీస్పూను, ఉప్పు-తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు- అర టీస్పూను, కారం, గరంమసాలా - ఒక్కొక్కటి ముప్పావు టీస్పూను, ధనియాలపొడి-అర టీస్పూను, నూనె లేదా నెయ్యి- ముప్పావు టేబుల్‌స్పూను, గ్రీన్‌ యాలకులు-ఒకటి, జీలకర్ర- అర టీస్పూను, ఉల్లిపాయ-ఒకటి (సన్నటి ముక్కలుగా తరగి), పచ్చిమిర్చి-ఒకటి (పొడవుగా కోసి), కరివేపాకు- రెండు రెబ్బలు, తాజా కొబ్బరి తరుగు-ఒక టేబుల్‌స్పూను.
 
తయారీవిధానం
రొయ్యలను నానబెట్టిన పదార్థాలలో బాగా కలిపి అరగంట సేపు నాననివ్వాలి.
ఒక పాన్‌ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, యాలకులను వేగించాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్లో ఉప్పు వేసి అవి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా నూనెలో వేగించాలి. ఆ మిశ్రమంలో రొయ్యలు వేసి వేగించాలి. కొద్దిసేపటి తర్వాత అందులో కరివేపాకు వేసి రొయ్యలను మరికాసేపు పొయ్యిమీద ఉంచి దించాలి.
ఈ రొయ్యల వేపుడును వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-01-20T21:46:59+05:30 IST