కొబ్బరితో చిన్నరొయ్యల కూర

ABN , First Publish Date - 2018-01-20T21:48:07+05:30 IST

ఆలివ్‌ ఆయిల్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - ఒక కప్పు (సన్నగా తరిగి), జీలకర్ర, పసుపు...

కొబ్బరితో చిన్నరొయ్యల కూర

కావలసినవి
 
ఆలివ్‌ ఆయిల్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - ఒక కప్పు (సన్నగా తరిగి), జీలకర్ర, పసుపు, గరంమసాలా, మిర్చి- ఒక్కొక్కటీ అర టీస్పూను, వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పై పొట్టు తీసేసిన చిన్న రొయ్యలు- చిన్న గిన్నె నిండా, కొబ్బరిపాలు- కొన్ని, ఉప్పు- ఒక టీస్పూను, వండిన బాసుమతి రైస్‌- మూడు కప్పులు, కొత్తిమీర తరుగు-పావు కప్పు.
 
తయారీవిధానం
 
నూనెను ఫ్రైపాన్‌లో పోసి సన్నని మంటపై వేడిచేయాలి. ఉల్లిపాయముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చేదాకా రెండు నిమిషాలపాటు పాన్‌లో వేగించాలి. అందులో మసాలా, చిన్నరొయ్యలు, వెల్లులి పేస్టు వేసి బాగా కలపి రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి. అందులో కొబ్బరిపాలు, ఉప్పు వేసి పదినిమిషాలపాటు ఉడకనిచ్చి కూర ఘుమఘుమలాడుతుంటే పాన్‌ను స్టవ్‌ నుంచి కిందికి దించాలి.ప్లేటులో రెడీగా పెట్టుకున్న అన్నంపై ఈ కర్రీని వేసి పైన కొత్తిమీరతో అలంకరించాలి.

Updated Date - 2018-01-20T21:48:07+05:30 IST