మాంసం పులుసు

ABN , First Publish Date - 2018-01-27T23:35:43+05:30 IST

మటన్‌- ఒక కిలో (బాగా కడిగి నీరు వంపేయాలి), పసుపు- పావు టీస్పూను, కారం- ముప్పావు టేబుల్‌స్పూను...

మాంసం పులుసు

కావలసినవి
 
మటన్‌- ఒక కిలో (బాగా కడిగి నీరు వంపేయాలి), పసుపు- పావు టీస్పూను, కారం- ముప్పావు టేబుల్‌స్పూను, పచ్చిచింతకాయలు-సరిపడినన్ని (ఉడకబెట్టి గుజ్జు తీయాలి), ఉప్పు- తగినంత, నూనె- ఒకటిన్నర టేబుల్‌స్పూను. కచ్చాపచ్చాగా ఉండే పేస్టుకోసం: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక్కొక్కటి మూడు చొప్పున, వెల్లుల్లి రెబ్బలు-12, అల్లం - చిన్న ముక్క.
 
తయారీవిధానం
 
లోతైన కడాయిలో నూనె వేడిచేయాలి. ఉల్లిపాయ పేస్టును అందులో వేసి ఆరు నిమిషాలు వేగించాలి. తరువాత శుభ్రంచేసిన మటన్‌ను వేసి బాగా కలిపి ఎనిమిది నిమిషాలు స్టవ్‌ మీద ఉడికించాలి. పసుపు, కారం వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
తర్వాత రెండు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మాంసం సగానికి పైగా ఉడికేంత వరకు ఉంచాలి. ముందుగా రెడీ చేసుకున్న పచ్చిచింతకాయగుజ్జును, ఒక కప్పు నీళ్లను అందులో వేసి బాగా కలపాలి. మాంసం పూర్తిగా మెత్తగా అయ్యేవరకూ అంటే దాదాపు అరగంట ఉడికించాలి. మీకు కావలసిన చిక్కదనంలో గ్రేవీ తయారైన తర్వాత కడాయిని స్టవ్‌ మీద నుంచి కిందికి దించాలి. ఉప్పు సరిపోయిందో, లేదో చూసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లితే టేస్టీ మాంసం పులుసు రెడీ అయినట్టే. ఈ పులుసును వేడి అన్నంతో తింటే బాగుంటుంది.

Updated Date - 2018-01-27T23:35:43+05:30 IST