చికెన్ సమోసా

ABN , First Publish Date - 2018-08-19T18:03:52+05:30 IST

ఉడికించిన చికెన్ : 450 గ్రాములు, ఉల్లిపాయలు : రెండు పెద్దవి, పచ్చిమిర్చి : నాలుగు అల్లం తరుగు : రెండు చెంచాలు, పసుపు : పావు చెంచా, మిరియాల పొడి : అరచెంచా. చికెన్ మసాలా : రెండు చెంచాలు,..

చికెన్ సమోసా

కావలసిన పదార్థాలు
 
ఉడికించిన చికెన్ : 450 గ్రాములు, ఉల్లిపాయలు : రెండు పెద్దవి, పచ్చిమిర్చి : నాలుగు
అల్లం తరుగు : రెండు చెంచాలు, పసుపు : పావు చెంచా, మిరియాల పొడి : అరచెంచా. చికెన్ మసాలా : రెండు చెంచాలు, కరివేపాకు : కొద్దిగా, కొత్తిమీర : కొద్దిగా, ఉప్పు : తగినంత, నూనె : వేయించేందుకు సరిపడా, మైదా : ఒకటిన్నర కప్పు, గోరువెచ్చని నీళ్లు : పిండి కలిపేందుకు సరిపడా
 
తయారీ విధానం
 
మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, చెంచా నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని స్టౌపై పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి గోధుమ రంగులోకి మారాక అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాల య్యాక పసుపు, మిరియాలపొడి, చికెన్ మసాలా, సన్నగా కోసిన చికెన్ వేయాలి. చికెన కాస్త మెత్తబడ్డాక తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి దించేయాలి. దీన్ని చల్లార నివ్వాలి. నానిన మైదా పిండిని చపాతీలా చేసి నిలువుగా కోయాలి. అందులో ఒక భాగాన్ని త్రికోణాకృతిలో చుట్టి రెండు స్పూన్‌ల చికెన్ మసాలాను ఉంచి సమోసా ఆకృతిలో చేసుకుని అంచులు మూసి వేయాలి. ఇలానే మిగిలిన పిండిని చేసుకుని రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

Updated Date - 2018-08-19T18:03:52+05:30 IST