డ్రైప్రూట్స్‌, ఉసిరి జామ్‌

ABN , First Publish Date - 2018-12-01T20:24:30+05:30 IST

ఉసిరికాయలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయల్లోని గింజలు తీసేయాలి..

డ్రైప్రూట్స్‌, ఉసిరి జామ్‌

కావలసినవి
 
ఉసిరికాయలు - పావు కిలో, చక్కెర - 150 గ్రాములు, వేగించిన జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - రుచికి సరిపడా, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ - ఒక్కొక్కటీ ఒక్కో అర టేబుల్‌ స్పూను, సన్నటి కొబ్బరి ముక్కలు, పుచ్చకాయగింజలు - ఒక్కొక్కటీ ఒక్కో పావు టేబుల్‌స్పూను.
 
తయారీవిధానం
 
ఉసిరికాయలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయల్లోని గింజలు తీసేయాలి. లోతు ఎక్కువగా ఉన్న పాన్‌ తీసుకుని అందులో ఉసిరికాయలు, చక్కెర వేయాలి. అందులో ఇతర మసాలా దినుసులు కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం సమంగా చిక్కబడేవరకూ చిన్న మంటపై ఉడికించాలి. ఇందులో డ్రైఫ్రూట్‌ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఇది చల్లారిన తర్వాత జార్‌లో పెట్టి గట్టిగా మూతపెట్టాలి. వేడి చపాతీ లేదా బ్రెడ్‌పై ఈ జామ్‌ రాసుకుని తింటే యమ్మీగా ఉంటుంది.

Updated Date - 2018-12-01T20:24:30+05:30 IST