రోగాన్‌ ఘోష్‌

ABN , First Publish Date - 2018-12-29T21:20:45+05:30 IST

మటన్‌ - కిలో (ముక్కలుగా కోసి), నీళ్లు - ఐదు కప్పులు, ఉప్పు - సరిపడా, వెల్లుల్లిముద్ద - ఒక టేబుల్‌స్పూను..

రోగాన్‌ ఘోష్‌

కావలసినవి
 
మటన్‌ - కిలో (ముక్కలుగా కోసి), నీళ్లు - ఐదు కప్పులు, ఉప్పు - సరిపడా, వెల్లుల్లిముద్ద - ఒక టేబుల్‌స్పూను, స్వచ్ఛమైన నెయ్యి - ఒక కప్పు, లవంగాలు - నాలుగు, యాలకులు - ఎనిమిది (గ్రీన్‌), పసుపు - ఐదు టీస్పూన్లు, ఉల్లిపాయపేస్టు (ఫ్రైడ్‌) - రెండు టేబుల్‌స్పూన్లు, కశ్మీరీ కారం - నాలుగు టీస్పూన్లు (నీళ్లల్లో కలిపి), కుంకుమపొడి - కొద్దిగా ( ఇందులో రెండు టేబుల్‌స్పూన్ల గోరువెచ్చటి నీళ్లు పోయాలి), ఎండు తురాయిపూలు - ఒక కప్పు (ఒక కప్పు నీళ్లతో వాటిని వేడిచేయాలి), నల్లమిరియాలపొడి - పావు టీస్పూను.
 
తయారీవిధానం
 
మాంసంలో నీళ్లుపోసి కొద్దిసేపు ఉడికించాలి. ముక్కలను చిల్లుల గరిటెతో నీళ్లల్లోంచి తీసి ఓడ్చి ప్లేటులో పెట్టాలి. వాటికి అల్లం, వెల్లుల్లి పేస్టు పట్టించాలి. మటన్‌ని పూర్తిగా కాకుండా కొద్దిసేపే ఉడికించాలి. తర్వాత మటన్‌ ముక్కలను బయటకు తీయాలి.
వీటిని చల్లటి నీళ్లల్లో కడిగి మటన్‌ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ నీళ్లను మరో పాన్‌లో పోసి స్టవ్‌ మీద మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు మటన్‌ ముక్కలను అందులో మళ్లీ వేయాలి. మరో పాన్‌లో నెయ్యి వేడిచేయాలి. అందులో లవంగాలు వేసి అవి చిటపటలాడే దాకా గరిటెతో కలుపుతుండాలి. దాన్ని స్టవ్‌ మీద నుంచి తీసి టేబుల్‌స్పూను నీళ్లను అందులో చిలకరించి మూతపెట్టాలి. మరుగుతున్న నీళ్లలో యాలకులు, పసుపు, లవంగాలు, నెయ్యి, ఉల్లిపాయపేస్టులను వేసి స్టవ్‌పై మరో పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత నీళ్లల్లో కలిపిన కారం మిశ్రమాన్ని అందులో పోసి కలియబెట్టాలి. మంటను తగ్గించి మటన్‌ముక్కలు మెత్తబడే వరకూ మూతపెట్టి ఉడికించాలి. వేడినీళ్లల్లో ఉడికించిన తురాయి పూల ఎక్స్‌ట్రాక్టును, కుంకుమపువ్వు నీళ్లను అందులో వేసి పెద్ద మంటపై ఆ మిశ్రమాన్ని ఉడికిస్తే కశ్మీరీ స్పెషల్‌గా చెప్పుకునే రోగాన్‌ ఘోష్‌ రెడీ. దీన్ని వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-12-29T21:20:45+05:30 IST