పార్సీ కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2018-12-29T21:23:01+05:30 IST

మటన్‌ - 200 గ్రాములు (సన్నటి ముక్కలుగా చేసి), అల్లం పేస్టు - ఒక టీస్పూను, వెల్లుల్లి పేస్టు..

పార్సీ కట్‌లెట్స్‌

కావలసినవి
 
మటన్‌ - 200 గ్రాములు (సన్నటి ముక్కలుగా చేసి), అల్లం పేస్టు - ఒక టీస్పూను, వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - ఒకటి (కచ్చాపచ్చాగా నూరి), లవంగాలు, దాల్చినచెక్కపొడి - అర టీస్పూను, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప గుజ్జు - రెండు టేబుల్‌స్పూన్స్‌, పుదీనా - ఆరు ఆకులు, కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ - తగినన్ని, గుడ్లు - నాలుగు (బాగా గిలక్కొట్టి), నూనె- వేగించడానికి సరిపడా.
 
తయారీవిధానం
 
ఒక బౌల్‌లో మటన్‌ ముక్కల్ని వేసి చేత్తో నాలుగు నిమిషాలు కలపాలి. అందులో, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, కచ్చాపచ్చాగా నూరిన పచ్చిమిరప, పసుపు, కారం, లవంగం-ధనియాల పొడి, మెత్తగా నలిపిన బంగాళాదుంప ముక్కలు, పుదీనా, ధనియాలు, ఉప్పులన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మీడియం సైజు పట్టీలు చేయాలి. కట్‌లెట్స్‌ను రెండు వైపులా బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించి అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఎగ్‌ మిశ్రమంలో ఈ కట్‌లెట్స్‌ను ముంచి వేడి నూనెలో రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చే దాకా పట్టీలను వేగించాలి. ఈ వేడి మటన్‌ కట్‌లెట్స్‌ను ఉల్లిపాయలు, చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టమైన వారు వీటిపై నిమ్మరసం పిండుకోవచ్చు.

Updated Date - 2018-12-29T21:23:01+05:30 IST