గుమ్మడి కేక్‌

ABN , First Publish Date - 2018-12-29T23:06:36+05:30 IST

గుమ్మడి ప్యూరీ - ఒకటింబావు కప్పులు, సాల్ట్‌ లెస్‌ బటర్‌ - ఒక కప్పు, మైదా - రెండుంపావు కప్పులు..

గుమ్మడి కేక్‌

కావలసిన పదార్థాలు
 
గుమ్మడి ప్యూరీ - ఒకటింబావు కప్పులు, సాల్ట్‌ లెస్‌ బటర్‌ - ఒక కప్పు, మైదా - రెండుంపావు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా - ఒక టీ స్పూను, దాల్చినచెక్క పొడి - ఒక టీ స్పూను, మసాలా పొడి - ఒక టీ స్పూను, జాజికాయ పొడి - ముప్పావు టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, లవంగాలు - పావు టీ స్పూను, అల్లం తురుము - ముప్పావు టీ స్పూను, మజ్జిగ - ముప్పావు కప్పు, వెనిలా - అర టీ స్పూను, పంచదార పొడి - ఒకటింబావు కప్పులు, గుడ్లు - 3.
 
తయారుచేసే విధానం
 
ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసి ఉంచాలి. మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, దాల్చినచెక్క, మసాల పొడులు, జాజికాయ పొడి, అల్లం తురుము, లవంగాలు, ఉప్పు ఒక పాత్రలో కలపాలి. గుమ్మడి గుజ్జు, మజ్జిగ, వెనిలా కూడా మరో పాత్రలో వేసి బాగా కలపాలి. బటర్‌లో పంచదార వేసి నురుగ వచ్చేవరకు గిలకొట్టాలి. తర్వాత గుడ్ల సొన కలిపి ఒక నిమిషం పాటు గిలకొట్టాలి. ఇప్పుడు గుమ్మడి మిశ్రమం, మైదా మిశ్రమం రెండూ కలపాలి. ఒక స్పూన్‌ బటర్‌ కేక్‌ బాక్స్‌ అడుగున రాసి మిశ్రమాన్ని వేసి 45 - 50 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. తర్వాత ఒవెన్‌లోనే 15
నిమిషాలు ఉంచి
తీసెయ్యాలి.

Updated Date - 2018-12-29T23:06:36+05:30 IST