హాట్‌ క్రాస్‌ బన్స్‌

ABN , First Publish Date - 2019-04-20T15:55:31+05:30 IST

గోధుమ పిండి - 450 గ్రాములు, దాల్చినచెక్క పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, జాజికాయ పొడి - చిటికెడు, పంచదార - 50గ్రా, కోడిగుడ్లు - 2..

హాట్‌ క్రాస్‌ బన్స్‌

కావలసిన పదార్థాలు
 
గోధుమ పిండి - 450 గ్రాములు, దాల్చినచెక్క పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, జాజికాయ పొడి - చిటికెడు, పంచదార - 50గ్రా, కోడిగుడ్లు - 2, ఈస్ట్‌ - 25 గ్రా, ఎండుద్రాక్ష - 75గ్రా, కోడిగుడ్డు.
 
తయారీవిధానం
 
గోధుమపిండిలో దాల్చిన చెక్కపొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి.
ఒక చిన్న పాత్రలో ఈస్ట్‌ తీసుకొని ఒక టీస్పూన్‌ పంచదార వేసుకోవాలి. మరొక పాత్రలో పాలు వేడి చేసుకొని, పంచదార కలపాలి. దానిలో కోడిగుడ్డు కొటి,్ట బాగా కలపాలి.
ఇప్పుడు ఈస్ట్‌ వేయాలి. తరువాత పిండి వేసుకుంటూ బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు ఉడికించాలి. తరువాత దీన్ని రోల్స్‌ మాదిరిగా చేసుకుంటూ బేకింగ్‌ షీట్స్‌పై వేయాలి. అరగంట పాటు పక్కన పెట్టాలి. కోడిగుడ్డు కొట్టి పైన పూత మాదిరిగా పూయాలి. ఓవెన్‌లో 20 నిమిషాల పాటు వేడి చేసుకొని, వెన్నతో పాటు తింటే భలే రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-04-20T15:55:31+05:30 IST