చింతచిగురు ఎండురొయ్యల కూర

ABN , First Publish Date - 2019-05-04T19:56:53+05:30 IST

ఎండు రొయ్యలు - పావు కప్పు, చింతచిగురు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు

చింతచిగురు ఎండురొయ్యల కూర

కావలసిన పదార్థాలు
 
ఎండు రొయ్యలు - పావు కప్పు, చింతచిగురు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - ఒకటి, కారం - టీస్పూన్‌, పసుపు - కొద్దిగా, కొత్తిమీర - కట్ట, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేయు విధానం
 
కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఎండు రొయ్యలు వేసి కారం, పసుపు వేయాలి.
చింతచిగురు వేసి, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయాక, కుక్కర్‌ మూత తీసి, మరికాసేపు చిన్న మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-05-04T19:56:53+05:30 IST