వాటర్‌మెలన్‌ లెమనేడ్‌

ABN , First Publish Date - 2019-05-18T20:22:18+05:30 IST

పుచ్చకాయ ముక్కలు - ఆరు కప్పులు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్‌లు, తులసి ఆకులు - రెండు, నీళ్లు - నాలుగు కప్పులు, పంచదార - పావు కప్పు, ఐస్‌ - కొద్దిగా..

వాటర్‌మెలన్‌ లెమనేడ్‌

కావలసినవి
 
పుచ్చకాయ ముక్కలు - ఆరు కప్పులు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్‌లు, తులసి ఆకులు - రెండు, నీళ్లు - నాలుగు కప్పులు, పంచదార - పావు కప్పు, ఐస్‌ - కొద్దిగా.
 
తయారీవిధానం
 
పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి బాగా పట్టుకోవాలి. ఒక పాత్రలో దాన్ని తీసుకొని నిమ్మరసం, పంచదార, ఐస్‌ ముక్కలు, తులసి ఆకులు, నీళ్లు వేసి బాగా కలియబెట్టాలి.
నిమ్మకాయ ముక్కలు లేదా పుచ్చకాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-05-18T20:22:18+05:30 IST