బార్లీ షర్బత్‌

ABN , First Publish Date - 2019-05-18T20:21:21+05:30 IST

బార్లీ - అరకప్పు, పంచదార - రెండు టీస్పూన్‌లు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తగినన్ని, తేనె - ఒకస్పూన్‌.

బార్లీ షర్బత్‌

కావలసినవి
 
బార్లీ - అరకప్పు, పంచదార - రెండు టీస్పూన్‌లు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తగినన్ని, తేనె - ఒకస్పూన్‌.
 
తయారీవిధానం
 
బార్లీ గింజలను శుభ్రంగా కడిగి కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఆ నీటిని తీసేసి, ఫ్రెష్‌ వాటర్‌ పోసి కుక్కర్‌లో ఉడికించాలి. బార్లీ గింజలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత పంచదార, నిమ్మరసం, తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఐస్‌ ముక్కలు వేస్తే బార్లీ షర్బత్‌ రెడీ. వేసవిలో ఇది ఆరోగ్యకరం కూడా.

Updated Date - 2019-05-18T20:21:21+05:30 IST