చికెన్‌ పకోడీ

ABN , First Publish Date - 2019-06-29T20:25:41+05:30 IST

చికెన్‌ - పావు కేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, సెనగపిండి - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఎండు మామిడి పొడి

చికెన్‌ పకోడీ

కావలసినవి
 
చికెన్‌ - పావు కేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, సెనగపిండి - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఎండు మామిడి పొడి (ఆమ్‌చూర్‌) - ఒక టీస్పూన్‌, దానిమ్మ గింజల పొడి - రెండు టీస్పూన్లు, బేకింగ్‌సోడా - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, నూనె - తగినంత, ఉప్పు - సరిపడా.
 
తయారీవిధానం
 
చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకపాత్రలో సెనగపిండి తీసుకొని, జీలకర్ర, ధనియాలపొడి, ఎండు మామిడి పొడి, దానిమ్మ గింజల పొడి, బేకింగ్‌ సోడా, కొత్తిమీర, పుదీనా వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలియబెట్టాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఈ మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. చట్నీతో తింటే చికెన్‌ పకోడీ రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-06-29T20:25:41+05:30 IST