గాజర్‌ మటర్‌

ABN , First Publish Date - 2019-07-13T20:29:06+05:30 IST

పచ్చి బఠాణీ - రెండు కప్పులు, క్యారెట్‌ - ఒకటి, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఇంగువ

గాజర్‌ మటర్‌

కావలసినవి
 
పచ్చి బఠాణీ - రెండు కప్పులు, క్యారెట్‌ - ఒకటి, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఇంగువ - చిటికెడు, మెంతులు - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టేబుల్‌ స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.
 
తయారీవిధానం
మెంతులు, సోంపు గింజలను వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ వేయాలి. క్యారెట్‌, పచ్చి బఠాణీ వేసి వేగించాలి. కారం, గరంమసాలా, ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై ఉడికించాలి. నిమ్మరసం పిండుకుని దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-07-13T20:29:06+05:30 IST