పాలకూర వడలు

ABN , First Publish Date - 2019-09-21T17:24:22+05:30 IST

బొబ్బర్లు - ఒకటిన్నర కప్పు, పాలకూర - రెండు కట్టలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు

పాలకూర వడలు

కావలసినవి
 
బొబ్బర్లు - ఒకటిన్నర కప్పు, పాలకూర - రెండు కట్టలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
 
తయారీవిధానం
 
బొబ్బర్లను కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. పాలకూరను శుభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్నగా తరగాలి. కొత్తిమీరను చిన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, పాలకూర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి అయ్యాక ఉండలను ఒక్కొక్కటి తీసుకుంటూ వడల మాదిరిగా ఒత్తుకుంటూ వేసి వేగించాలి. చట్నీతో తింటే ఈ పాలకూర బొబ్బర్ల వడలు భలే టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2019-09-21T17:24:22+05:30 IST