కస్టర్డ్‌ యాపిల్‌ స్మూతీ

ABN , First Publish Date - 2019-11-02T16:11:56+05:30 IST

సీతాఫలాలు - ఆరు, యాపిల్స్‌ - రెండు, పాలు - రెండు గ్లాసులు, తేనె - రెండు టీస్పూన్లు, ఐస్‌క్యూబ్‌లు - మూడు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వెనీలా - రెండు స్కూప్స్‌, పంచదార - ఒక టేబుల్‌స్పూన్‌.

కస్టర్డ్‌ యాపిల్‌ స్మూతీ

కావలసిన పదార్థాలు: సీతాఫలాలు - ఆరు, యాపిల్స్‌ - రెండు, పాలు - రెండు గ్లాసులు, తేనె - రెండు టీస్పూన్లు, ఐస్‌క్యూబ్‌లు - మూడు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వెనీలా - రెండు స్కూప్స్‌, పంచదార - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ విధానం: ముందుగా సీతాఫలంలో విత్తనాలు తీసేసి గుజ్జును పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో యాపిల్‌ ముక్కలు, సీతాఫలం గుజ్జు, పాలు పోసి గ్రైండ్‌ చేయాలి. తేనె, పంచదార, ఐస్‌క్రీమ్‌, ఐస్‌క్యూబ్‌లు వేసి మరికాసేపు గ్రైండ్‌ చేయాలి. యాలకుల పొడి వేసి మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా ఉన్నప్పుడే కస్టర్డ్‌ యాపిల్‌ స్మూతీని సర్వ్‌ చేసుకొని ఆరగించాలి.

Updated Date - 2019-11-02T16:11:56+05:30 IST