Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎగ్‌లెస్‌ పైనాపిల్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - రెండున్నర టీస్పూన్లు, వెన్న - అర కప్పు, పంచదార పొడి - ఒకటిన్నర కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌, ఉప్పు - కొద్దిగా, కేక్‌ టిన్‌ - ఒకటి, పైనాపిల్‌ ముక్కలు - ఒక కప్పు, పైనాపిల్‌ జ్యూస్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ - మూడు కప్పులు, చెర్రీలు - కొన్ని.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి, బేకింగ్‌ పౌడర్‌ తీసుకొని ఉప్పు, పంచదార, వెన్న, వెనీలా ఎసెన్స్‌, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. పెరుగు వేసి మిశ్రమం మెత్తగా అయ్యే వరకు కలియబెట్టాలి. తరువాత మిశ్రమాన్ని టిన్‌లోకి మార్చాలి. టిన్‌ను ఓవెన్‌లో 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలు బేక్‌ చేయాలి. క్రీమ్‌, పంచదారను ఒక పాత్రలో కలియబెట్టాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఓవెన్‌లో నుంచి టిన్‌ను బయటకు తీయాలి. మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకుని అడ్డంగా రెండు ముక్కలు చేయాలి. ఇప్పుడు ఒక ముక్కపై క్రీము సమంగా రాయాలి. పైనాపిల్‌ ముక్కలు వేయాలి.
దానిపై మరో ముక్క పెట్టి మళ్లీ అంతటా సమంగా క్రీము పెట్టాలి. పైనాపిల్‌ జ్యూస్‌ అంతటా చల్లాలి. పైనాపిల్‌ ముక్కలు, చెర్రీలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరుసంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలిస్వయం ఉపాధి శిక్షణపై అవగాహనసురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయంపొంచి ఉన్న ప్రమాదం పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలిస్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
Advertisement