బీన్స్‌ వేపుడు

ABN , First Publish Date - 2020-01-25T16:49:14+05:30 IST

కావలసినవి: ఫ్రెంచ్‌ బీన్స్‌ - అరకేజీ, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, పసుపు - అర టీస్పూన్‌, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు -

బీన్స్‌ వేపుడు

కావలసినవి: ఫ్రెంచ్‌ బీన్స్‌ - అరకేజీ, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, పసుపు - అర టీస్పూన్‌, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు.
 
తయారీ: బీన్స్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నువ్వులు, జీలకర్ర, కొబ్బరి తురుము వేసి వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌, పసుపు వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై పదినిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాల వేయాలి. తగినంత ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.
వేడి వేడిగా చపాతీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-01-25T16:49:14+05:30 IST