Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆవిరి గుమ్మడి కేక్‌

కావలసిన పదార్థాలు: కొర్రలు - 100 గ్రా., పండిన గుమ్మడికాయ - 300 గ్రా., పాలు - 300 మి.లీ., మైదా - 300 గ్రా., ఈస్ట్‌ పొడి - 4 గ్రా., పంచదార - 30 గ్రా., కిస్‌మిస్‌, క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, నువ్వులు - అలంకరణకు.
 
తయారుచేసే విధానం: కొర్రలను 5 గంటలసేపు నానబెట్టి వడకట్టాలి. గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి. చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్‌ పొడి వేసి ఉండలు లేకుండా కలిపి ప్లాస్టిక్‌ పేపరు కప్పి పక్కనుంచాలి. మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి. తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి.

డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌చాక్లెట్‌ కేక్‌యాపిల్‌ కేక్‌బనానా జామ్‌ కేక్‌పౌండ్‌ కేక్‌మార్బుల్‌ కేక్‌అరటి మఫిన్స్‌చాక్లెట్‌ కేక్‌మ్యాంగో చీజ్‌ కేక్‌స్ట్రాబెర్రీ ఛీజ్‌ కేక్‌ స్మూతీ
Advertisement