అప్పి పాయసం (మలయాళ వంటకం)

ABN , First Publish Date - 2015-08-26T22:08:56+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు - 1 లీటరు, పంచదార - 1 కప్పు, కుంకుమపువ్వు - 4 కాడలు, రవ్వ - 2 కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు

అప్పి పాయసం (మలయాళ వంటకం)

కావలసిన పదార్థాలు: పాలు - 1 లీటరు, పంచదార - 1 కప్పు, కుంకుమపువ్వు - 4 కాడలు, రవ్వ - 2 కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నెయ్యిని, సరిపడా నీటిని రవ్వలో కలిపి ముద్దగా చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసేకుని పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. కడాయిలో పాలు, పంచదార వేడి చేసి, చిక్కబడగానే కుంకుమపువ్వు వేయాలి. తర్వాత పూరీలను చిన్న చిన్న ముక్కలుగా తుంచి పాలల్లో వేసి తినాలి.

Updated Date - 2015-08-26T22:08:56+05:30 IST