ఎగ్‌ పరాటా

ABN , First Publish Date - 2015-08-30T23:07:15+05:30 IST

కావలసిన పదార్థాలు: గుడ్డు -1 (రెండు పరాటాలకు), గోధుమపిండి/మైదా - 1 కప్పు, టమోటో - 1, ఉల్లిపాయ -1

ఎగ్‌ పరాటా

కావలసిన పదార్థాలు: గుడ్డు -1 (రెండు పరాటాలకు), గోధుమపిండి/మైదా - 1 కప్పు, టమోటో - 1, ఉల్లిపాయ -1, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చి - 1, ఉప్పు - రుచికి సరిపడా, కారం - అర టీ స్పూను, చాట్‌ మసాలా - అర టీ స్పూను, ధనియాలపొడి - అర టీ స్పూను, జీరాపొడి - అర టీ స్పూను, నూనె - పరాటాలు కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి. సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి. తర్వాత పెనం పై వేసి సన్నని మంటపై కాలుస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్‌ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి. తర్వాత గుడ్డు పచ్చివాసన పోయేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T23:07:15+05:30 IST