కారెట్‌, బాదం స్వీట్‌

ABN , First Publish Date - 2015-09-01T22:12:16+05:30 IST

కావలసిన పదార్థాలు: బాదం పప్పు - 1 కప్పు, పంచదార - 2 కప్పులు,

కారెట్‌, బాదం స్వీట్‌

కావలసిన పదార్థాలు: బాదం పప్పు - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, వెన్న - అర కప్పు, కారెట్‌ - 1, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి ( తర్వాత కొద్దిసేపు మైక్రోవేవ్‌లో పెడితే పైపొట్టు త్వరగా వచ్చేస్తుంది). కారెట్‌ని కూడా మైక్రోవేవ్‌లో ఉడికించాలి. బాదం, కారెట్‌లని కొద్దిగా నీరు, లేదా పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పంచదార, వెన్న వేసి బాదం మిశ్రమం కలిపి మళ్లీ మైక్రోవేవ్‌లో పెట్టాలి. పైన రంధ్రాలు పడినట్టు కన్పించగానే యాలకుల పొడి చల్లి, నెయ్యిరాసిన పళ్లెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.

Updated Date - 2015-09-01T22:12:16+05:30 IST