ఉలవల పచ్చడి

ABN , First Publish Date - 2015-09-02T16:27:23+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉలవలు - ముప్పావు కప్పు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, ఆవాలు, జీలకర్ర

ఉలవల పచ్చడి

కావలసిన పదార్థాలు: ఉలవలు - ముప్పావు కప్పు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, దనియాలు - 1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి - 5, కరివేపాకు - 4 రెబ్బలు, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఉలవల్ని 2 గంటలసేపు నానబెట్టి రెండు కప్పుల నీటితో కుక్కర్లో ఉడికించాలి. ఉడికిన ఉలవలను వడ కట్టి ఆ నీటిని ఒక గిన్నెలో పక్కనుంచాలి. కడాయిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, దనియాలు, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తాలింపు చల్లబడ్డాక ఉలవలతో పాటు తగినంత ఉప్పు చేర్చి, వడకట్టి పక్కనుంచిన నీరు చిలకరిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T16:27:23+05:30 IST